North Korea: హైపర్ సోనిక్ క్షిపణి విజయవంతంగా పరీక్ష..! 1 d ago
ఉత్తర కొరియా సోమవారం హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. కిమ్ జోంగ్ ఉన్, ఈ క్షిపణి పసిఫిక్ సముద్రంలో ఉన్న శత్రువులపై ప్రభావం చూపగలదని ప్రకటించారు. ఈ ప్రయోగం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ దక్షిణ కొరియా, జపాన్‌లో పర్యటిస్తున్న సమయంలో జరిగింది. "ఈ క్షిపణి పసిఫిక్ సముద్రం వైపున్న ఏ శత్రువునైనా నమ్మకంగా ఎదుర్కొనగలదు" ఇది ఉత్తర కొరియాను బలంగా చేస్తుందని ది కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.